![]() |
![]() |

స్టార్ మా ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ క్రేజీ షోలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. బిగ్‌బాస్ సీజన్ 4తో మరింత పాపులారితో పాటు టీఆర్పీని సొంతం చేసుకుని లీడింగ్ ఛానల్ గా మారిన స్టార్ మా తాజాగా '100% లవ్' షోతో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించబోతోంది. రియల్ కపుల్స్ వర్సెస్ రీల్ కపుల్స్‌తో ఈ షోని ప్రారంబించారు.
యాంకర్ రవి, వర్షిణి సౌందరరాజన్ ఈ షోకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఈ షో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఆరు రియల్ జంటలు.. ఆరు రీల్ జంటలు ఈ షోలో పాల్గొంటున్నారు. కార్తీక దీపంతో పాపులర్ అయిన నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆటల్ని భార్యతో కలిసి ఆడిన నిరుపమ్ "రియల్ కపుల్‌తో పెట్టుకుంటే పగిలిపోద్ది" అంటూ రీల్ జంటలని ఉద్దేశించి అన్న మాటలు వైరల్‌గా మారాయి.
దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఆరు రీల్ జంటలుగా సీరియల్ జోడీలు పాల్గొనగా.. ఆరు రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన జంటలు పాల్గొన్నాయి. వీరంతా కలిసి పోటాపోటీగా ఆడిన ఆటలు.. చేసిన అల్లరి వీక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేదిగా వుంది.
![]() |
![]() |